తుపాకి పేలి సబ్ జైల్ ఏఆర్ హెడ్కానిస్టేబుల్ మృతి..

1 min read



తుపాకి పేలి సబ్ జైల్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. వెస్ట్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి నగరంలోని సబ్ జైల్లో విధులు నిర్వహిస్తున్న ఏ .ఆర్ హెడ్ కానిస్టేబుల్ తుపాకి పేలి లక్ష్మీ నారాయణ రెడ్డి 47 సంవత్సరాలు మృతి చెందడం జరిగింది. ఈ విషయాన్ని తన తోటి సహచర కానిస్టేబుల్ సమాచారాన్ని తెలుసుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీనిపై వెస్ట్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు. మృతిచెందిన హెడ్ కానిస్టేబుల్ 1992 బ్యాచ్ చెందిన కానిస్టేబుల్ ఏపీఎస్పీ లో పనిచేస్తూ ఏ. ఆర్. కు కన్వర్షన్ అయ్యారు. పి .టి .సి కళ్యాణ్ రామ్ లో పనిచేస్తూ పదోన్నతి పై చిత్తూర్ కి వెళ్లారు. అక్కడి నుంచి మూడు నెలల క్రితం అటాచ్మెంట్ తిరుపతి సబ్ జైలు కు రావడం జరిగింది. తిరుపతి నగరంలో ఎస్ టి వి నగర్ లో కాపురం ఉంటున్నారు.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెస్ట్ . సిఐ శివ ప్రసాద్ పేర్కొన్నారు..

Total Page Visits: 160 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed