SGS TV Telugu

24×7 News

తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు బలుపు కాదు…

1 min read

తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు బలుపు కాదు…అక్రమాలతో వచ్చిన వాపు మాత్రమే…నైతిక విజయం పనబాక లక్ష్మిదే..

అమరావతి
మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఒక్క రూపాయి లేకుండా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని బెదిరింపులొచ్చినా 3.60 లక్షల మంది ఓటర్లు టీడీపీకి ఓటు వేసి పనబాక లక్ష్మి మంచి అభ్యర్థి అని నిరూపించారు…

నేరాలు..ఘోరాలు, బస్సుల్లో దొంగ ఓటర్లను తోలుకొచ్చి వైసీపీ సాధించిన గెలుపు కూడా గెలుపేనా…

తిరుపతి ఉప ఎన్నికను దేశమంతా చూడాలని గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు..

ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో కానీ… డబ్బు, మద్యం, వలంటీర్లు, పోలీసులు, దొంగ ఓట్లతో జరిగిన తిరుపతి ఎన్నికలను దేశమంతా చూసింది..

ఇది మా ఒక్కరి మాటే కాదు..రిటైర్డ్ సీఎస్, బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కూడా చెప్పారు..

దొంగ ఓటర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు కూడా అప్పగించారు..

కేంద్ర ఎన్నికల సంఘం కళ్లు ఉండీ చూడలేని విధంగా వ్యవహరించింది..

దొంగ ఓట్ల గెలుపుతో వైసీపీ ఓడిపోతే, ప్రజల మనస్సుల్లో విజయంతో టీడీపీ నైతికంగా గెలుపొందింది..

ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు వేసుకున్నా…అనుకున్న మెజార్టీ సాధించలేకపోయారు..

5 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాం..టీడీపీకి డిపాజిట్లు కూడా రావని, చాపచుట్టేస్తోందని వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికారు..

ఈ రోజు వారి పరిస్థితి చావుతప్పి కన్నులొట్టపోయినట్టయింది..

రాయలసీమకు చెందిన ఒక నాయకుడి మాటలు విని మెజార్టీపై బెట్టింగులు కట్టిన జగన్మోహన్ రెడ్డి అభిమానులు వందల కోట్లు నష్టపోయారు..

అసలు ఏం చేశారని వైసీపీకి ప్రజలు ఓటేయాలి…ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారా..ఉద్యోగాలు తెచ్చారా..వృద్ధి రేటు సాధించారా..నిధులేమైనా తెచ్చారా..

అప్పుల్లో ముంచి తేలుస్తున్నారని మీకు ఓట్లేసి గెలిపిస్తారా…

ఈ రోజు ఏపీలో నెలకొన్న పరిస్థితి దేశంలో మరెక్కడా లేదు..

ఒక్క నెల్లూరు జిల్లాలోనే రోజుకు 40 నుంచి 50 మంది బలవుతుంటే ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ఆ సంఖ్య 4 నుంచి 5కి మించడం లేదు..

కరోనా రోగులకు ఆస్పత్రిలో బెడ్లు, ఆక్సిజన్, ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని చూసి తిరుపతి ప్రజలు వైసీపీకి ఓట్లు వేస్తారా..

సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు..

2012 నెల్లూరు ఎంపీ ఉప ఎన్నికలో మేకపాటి రాజమోహన్ రెడ్డి 3.80 లక్షల మెజార్టీతో గెలిచారు..2014 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు దాదాపు సమానంగా ఓట్లు వచ్చాయనే విషయం గుర్తుంచుకోండి..

తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు బలుపు కాదని…అక్రమాలతో వచ్చిన వాపు అని గుర్తుంచుకోండి..

ఉప ఎన్నిక ఫలితంతోనే మీ పతనం మొదలైంది..రెండేళ్లలో మీరు చేసిన తప్పులకు ప్రజలు మీకు సూచాయగా హెచ్చరిక జారీ చేశారని మరిచిపోకండి..

పరీక్షలను వాయిదా వేయమని లోకేష్ బాబు కోరితే పెడచెవిన పెట్టిన ప్రభుత్వం, చివరకు హైకోర్టు చీవాట్లతో దారికొచ్చింది..

Total Page Visits: 25 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *