SGS TV Telugu

24×7 News

తడ నిప్పో ఫ్యాక్టరీ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.

1 min read

తడ నిప్పో ఫ్యాక్టరీ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.

ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి

కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ జాతీయ రహదారిపై నిప్పో పరిశ్రమ సమీపంలో మహారాష్ట్రకు చెందిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న మలిచి దొరస్వామి (65) ఘటనా స్థలంలోనే మృతిచెందగా కుమారుడు మల్లికార్జున్ (45) కి తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుని సులూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.

వివరాల మేరకు చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం చదులు పాకం గ్రామానికి చెందిన మలిచి దొరస్వామి తన కుమారుడితో కలిసి సులూరుపేట ఆస్పత్రికి వచ్చి తన స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు.

కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయి.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Total Page Visits: 6 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *