చిలకలూరిపేటలో భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ సివిల్ సప్లైస్ అధికారులు

1 min read

చిలకలూరిపేటలో భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ సివిల్ సప్లైస్ అధికారులు

చిలకలూరిపేట పట్టణం లోని రజక కాని డొంక హెచ్.పీ గ్యాస్ గోడను ఎదురు గల శ్రీ శ్రీనివాస రైస్ మిల్ లో ఒక లారీలో 400 బస్తాల అక్రమ రేషన్ బియ్యం లోడ్ చేసి బయటకు వస్తుండగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో గోవిందపురం చెందిన ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన ఒక ఆటో లో 40 బస్తాల రేషన్ బియ్యాన్ని కూడా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. లారీ లో 400 బస్తాల వరకు రేషన్ బియ్యం ఉన్నట్లు… ఆటలో 40 బస్తాలు ఉన్నట్లు తెలుస్తోంది. లారీని ఆటోను చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఉంచారు. చిలకలూరిపేట పట్టణంలో తెల్లవారుజామున అక్రమ రవాణా చేస్తూ పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని బయట అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అవుతూనే ఉన్నారు. రేషన్ మాఫియాకు చిలకలూరిపేట అడ్డాగా ఉన్న విషయం ఈ యొక్క దాడితో తేటతెల్లమవుతుంది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి రేషన్ అక్రమ రవాణా అవుతున్న కానీ సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఈ విషయం ప్రజలకు అర్థం కావట్లేదు. కాకుమాను నుండి పత్తిపాడు నుండి చిలకలూరిపేట గణపవరం మీదుగా రేషన్ రవాణా చేరుకొని నరసరావుపేట లో అక్రమంగా బియ్యం తరలుతున్నా అధికారులకు సమాచారం తెలిసినా ఎందుకు వాటిపై నిఘా వేయలేకపోతున్నారు అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ఇంటింటికి రేషన్ బియ్యం అందజేస్తున్న ఈ తరుణంలో … రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..

Total Page Visits: 13 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed