క్షణాల్లో నిర్మానుష్యమైపోయిన రహదార్లు

1 min read

ఒంగోలు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి వలన ఎందరో ప్రాణాలు కోల్పోయారు. వ్యాధి తీవ్రరూపం దాల్చకుండా కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న కఠినమైన చర్యల్లో భాగముగా నేడు 5వ తేదీ నుండి 20వ తేది వరకు 15 రోజులపాటు లాక్ డౌన్ అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ముందు నుండే సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ పోలీస్ అధికారులు కఠినమైన నిర్ణయాలను తీసుకొన్నారు.

ఉదయం ఆరు గంటల నుండి మధ్యహాన్నం 12గంటల వరకు వివిధ నిత్యవసర వ్యాపార సంస్థలను తెరచి ఉంచేటట్లు, అనంతరం 12గం.నుండి మరునాడు ఉదయం 6వరకు కర్ఫ్యూ విధించారు. ఎలాంటి ప్రజా రవాణా కూడా జరకూడదని హుకుం జారీచేశారు.

ఈ పరిస్థితులలో వ్యాపారస్తులు సమయం మధ్యహాన్నం 12 కాక మునుపే మూసివేతకు సిద్దపడ్డారు. పోలీసులు మరియు మున్సిపల్ అధికారులు మరియు వలంటీర్లు షాపులను మూసివేయవలసినదిగా వ్యాపారస్తులను కోరారు.

అతిక్రమించిన వారిని, వారి సంస్థలను ఫోటో తీసి ఛలాన్లు పంపుచున్నారు. దాంతో బెంబేలెత్తిన ప్రజలు స్వచ్ఛందంగా, తమ పనులను త్వరగా ముగించుకొని తమ గృహాలకు బయలుదేరారు.

నగరం లోని రహదారులు ఒక్కసారిగా నిర్మానుష్యమైపోయినవి.

ఇంతటితోనైనా కరోనా అంతమైపోతే బాగుండునని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Total Page Visits: 57 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed