కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెట్టి.ఫాల్గుణ

1 min read

అరకులోయ న్యూస్

కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెట్టి.ఫాల్గుణ

అరకులోయ మండలం గన్నెలలో గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద నేచర్ సంస్థ అధ్యక్షులు వికాస్ బాలరాజు ఆధ్వర్యంలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం ప్రారంభోవత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చెట్టి.ఫాల్గుణ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది.దీంతో గిరిజనులు తీవ్ర భయాందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు నేచర్ లాంటి స్వచ్చంద సంస్థలు వారి సేవలను అందిచడానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు.ఈ కార్యక్రమంలో నేచర్ సంస్థ వారు ఎంతో వ్యయ ప్రయాసలను ఓర్చి కోవిడ్ లక్షణాలున్న రోగులకు విలువైన న్యూట్రిషన్ ఆహారానికి సంబంధించిన వనరులతో పాటు ధర్మామీటర్ పల్స్ ఆక్సిమీటర్ మెడికల్ కిట్లు తదితర సామగ్రి గిరిజనులకు ఉచితంగా పంపిణీ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు.గిరిజనులకు ఇలాంటి విలువైన సేవలంది స్తున్న నేచర్ సంస్థ అధినేత వికాస్ బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాత కార్పోరేషన్ డైరెక్టర్ పోలవరపు.అప్పారావు గన్నెల సర్పంచ్ బి.బి.బొజ్జ లోతేరు సర్పంచ్ గుబాయి.కళావతి పెదలబుడు కొర్రాయి గన్నెల మాజీ సర్పంచులు సమర్డీ రఘునాధ్ కిల్లో.దొన్ను పెదకాపు అర్జున్ ఆసుపత్రి సిబ్బంది కమల వైసీపీ సీనియర్ నాయకులు ముఖీ.సాంబా కొర్రా.రామరావు గుబాయి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Total Page Visits: 10 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed