SGS TV Telugu

24×7 News

కొవిడ్‌కు వ్యాక్సినేషనే పరిష్కారం: జగన్‌
కరోనా వ్యాక్సినేషన్‌పై సీఎం సమీక్ష

1 min read

అమరావతి: కొవిడ్‌కు వ్యాక్సినేషన్‌ మాత్రమే పరిష్కారమని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం నెలకు ఏడు కోట్లు మాత్రమేనని.. 45 ఏళ్లకు పైబడిన వారు దేశవ్యాప్తంగా 26 కోట్ల మంది ఉన్నారన్నారు. వీరికి నాలుగు వారాల వ్యవధిలో రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వ్యాక్సిన్లు కావాలన్నారు. తొలి డోసు ఇప్పటివరకు కేవలం 12 కోట్ల మందికి మాత్రమే వేశారని.. రెండో డోసు 2.60 కోట్ల మందికి ఇచ్చారని చెప్పారు. మొత్తం కలిపి చూసినా ఇప్పటివరకు కొవిడ్ వ్యాక్సిన్‌ డోసులు 15 కోట్లు మాత్రమేనని వెల్లడించారు. ఇంకా 39 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు కావాల్సి ఉంటుందన్నారు.

భారత్‌ బయోటెక్‌ నెలకు కోటి వ్యాక్సిన్లు, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆరు కోట్ల టీకాలను తయారు చేస్తున్నాయని సీఎం వెల్లడించారు. ఇతర సంస్థల నుంచి టీకా రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు.

Total Page Visits: 6 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *