SGS TV Telugu

24×7 News

కార్మిక హక్కుల పరిరక్షణకు కలిసి పోరాడుదాం! కామనురు. శ్రీనివాసులురెడ్డి

1 min read


కడప ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని ఐ. ఓ. సి ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సి ఐ టి యు మే డే జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యకరమానికి సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనివాసులురెడ్డి జండా ఆవిష్కరించారు అంనతరం ఆయన మాట్లాడుతూ
మే డే రెండు అక్షరాల వదం వినడానికి వినసొంపుగాఉన్నాదీని వెనుక అనేక త్యాగాల చరిత్ర దాగివుంది. 135 సంవత్సరాల క్రితం కార్మికులపై జరిగిన దమనకాండను గుర్తు చేస్తుంది. శ్రామికుల శ్రమను దోపిడీ చేస్తున్న సామ్రాజ్యవాద, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, పోరాటంలో అమరులైన వారి త్యాగఫలమే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. 1886 మే 4న అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని దినాల, కార్మికహక్కుల కోసం విధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. శ్రామికవర్గం ఐకమత్యం చూసి జీర్ణించుకోలేని సామ్రాజ్యవాదులు శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనను పోలీసులను ఉపయో గించి రక్తసిక్తం చేశారు. కార్మికవర్గాన్ని భయాందోళనకు గురి చేయా లని, ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేశారు. కార్మికవర్గం వారి ఆగడాలకు వేరవకుండా మనోనిబ్బరంతో కోలుకుని తిరిగి మూడు రోజుల తరువాత పోరాటం కొనసాగించి హక్కులు సాధిం చారు. పలుదేశాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తున్నారు. నాటి నుండి కార్మికవర్గం చైతన్యమై అనేక నిరసనలు, పోరాటాలు కొనసాగించాయి. చికాగోలోని కొందరు రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. తమ శ్రమను కారుచౌకగా రోజుల తర బడి పారిశ్రామికవేత్తలు తమ శ్రమను దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే,మా శక్తికి కూడా పరిమిత అని బయటకి వచ్చి గలమెత్తారు. 1923లో తొలిసారిగా భారత్లో మేడే’ను. పాటించారు. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటంతో అప్పటి కా నుంచే కార్మికవర్గాల్లో చైతన్యం మొదలైంది. ఆ చైతన్యంతో మేడే ను పాటిస్తున్నారు. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటు చేసుకున్న ప్రైవేటైజేషన్,లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మి కులకు కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. 135 సంవ త్సరాల క్రితం ప్రాణత్యాగం చేసి సాధించిన హక్కులను ప్రస్తుత పాలకులు కాలరాస్తునారు. ఆనాటి చట్టాల ద్వారానే నేడు కార్మికులకు ఎంతో కొంత ఉపశమనం లభి దస్తుంది. కానీ నేడు స్వాతంత్ర భారతదేశంలో రక్తతర్పణం చేసి ర సాధించిన చట్టాలను రద్దు చేసి పారిశ్రామికవేత్తలు శ్రమ దోపిడీ చేయడానికి తెరిచారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కు లపై దాడిని తీవ్రతరం చేసింది. కార్మిక చట్టాలను రద్దు చేయడం, పనిగంటలు ఉద్యోగ భద్రతపై దాడి చేయడంతోపాటు కార్మికులకు టి కట్టు బానిసలుగా చేయడానికి ఉన్న 44 కార్మిక చట్టాలను రద్దు మెడే చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చారు. కరోనా మహమ్మా గాల్లో రి నుండి ప్రజలను కాపాడాల్సిన పాలకులు కరోనాను అడ్డుపెట్టు కుని అప్రజాస్వామికంగా, నిరంకుశంగా లేబర్ కోడ్లు, రైతుతిరేక నల్లచట్టాలు చేశారు. కరోనాతో కార్మికులు ఉపాధి కోల్పోయి
విధినపడ్డారు. ప్రభుత్వాలు వారికి ఎలాంటి సహాయం చేయకుండా పారిశ్రామికవేత్తలకు కోట్లరూపాయలు రాయితీలు అందించి కార్పొరేట్ సంస్థలకు అండగా నిలిచారు. వీటికితోడుగా ప్రభుత్వ దొంగ సంస్థలైన, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, భారతీయ నైల్వేపోర్ట్స్ గ్యాస్, ఎల్బీసి తదితర సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారు. చివరకు ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ పట్నం ఉక్కు పరిశ్రమను కూడా కార్పొరేట్ సంస్థకు ఇవ్వడానికి పూనుకున్నారు. మనరాష్ట్రంలో కూడా శాశ్వత ఉద్యోగులు ఉండా. రెగ్యులర్ చోట ఔట్సోర్సింగ్ కార్మికులతో పనిచేయిస్తూ గౌరవ వేతనం తో శ్రమ దోపిడీ చేస్తున్నారు. వీరికి పాలకులు మారిన ప్రతిసారి ఉద్యోగ భద్రతకోల్పోతున్నారు. అధ్యక్షడు రంగారెడ్డి , మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు కాలం చెల్లిన జిఓలు అమలు అవుతున్నాయి. ప్రభుత్వం వేతన సవరణకు చర్యలు చేపట్టలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక చట్ట వ్యతిరేక విధానాలు చూస్తే వీరు ఏమాత్రం కార్మికుల గురించి ఆలోచించలేదు. కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ కార్మికులను గుర్తించలేదు. కావున కార్మిక వర్గం మేలుకోవాలి. చికాగో నగర అమరవీరుల స్ఫూర్తితో 135వ మేడే సందర్భంగా ఆయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అను సరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేకచట్టాల రద్దు చేయాలని పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో వెంటకృష్ణ, నాజరెస్ ,సుబ్బారెడ్డి, నాయక్,శ్రీను , తదితరుల పాలుగొనరు

Total Page Visits: 7 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *