కారణం లేకుండా బయటికివస్తే పనిష్మెంట్ తప్పదు

1 min read

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం

స్థానిక పాత బైపాస్ రోడ్డు జంక్షన్ లో సెంట్రల్ జోన్ డిఎస్పి సంతోష్ కుమార్ పోలీస్ సిబ్బంది మాస్కులు మరియు
కర్ఫ్యూ పై అవగాహన కల్పించడం, ఏటువంటి కారణం లేకుండా బయటకు వచ్చిన వారికి పనిష్మెంట్ పక్కన కూర్చోబెట్టి ,
కారణం లేకుండా వచ్చిన వారికి తగు చర్యలు తీసుకుంటామని, ఇప్పుడైనా ఇకనైనా ప్రజలందరూ నిబంధనలు పాటించాలని, మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది అని, కుటుంబం బాగుంటే ఊరు బాగుంటుంది ,ఊరు బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా అలాగే ఆంధ్ర బాగుంటది ఆంధ్ర బాగుంటే ఇండియా బాగుంటది ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. అని ప్రతి ఒక్క పిల్లలకు మాటలు నేర్పినట్టు నడిపిస్తున్నట్లు ఎంత చెప్పినా జనంలో 90 శాతం వారు మాత్రమే పాటిస్తున్నారు అని 10 పర్సెంట్ విచ్చలవిడిగా తిరుగుతున్నారని అటువంటి వారిపై తప్పకుండా కేసులు తీసుకుంటామని, ఇంట్లో ఉండి అందరూ కుటుంభం తో గడపాలని, ప్రతి ఒక్కరికి చెప్తున్నాం
బయట తిరిగితే ఉల్లాసం ఉత్సాహం రాదు కరోనా మహమ్మారి తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి నీతో పాటు ఫ్యామిలీ లో వ్యాప్తి చెందుతోంది అని, ఎంత చెప్పినా మీకు అర్థం కావడం లేదు, ఇకనైనా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి,సామాజిక దూరం పాటించాలి అని ప్రజలు ఈ విషయం గమనించాలి అని మీడియా మిత్రులతో సంతోష్ కుమార్ మాట్లాడుతూ తెలుయపరిచారు.

Total Page Visits: 18 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed