కాకాణి చేతులు మీదుగా చెక్కుల పంపిణీ”

1 min read

తేది:01-06-2021
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం కమ్యూనిటీ హాల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 77 మంది లబ్ధిదారులకు 45.3 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించే ఆర్థిక సహాయం ద్వారా ఆరోగ్యంతో పాటు, ఆర్ధికంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు నిలదొక్కుకోవాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే కాకాణి గారి కుమార్తె శ్రీమతి పూజిత.

సర్వేపల్లి నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన 383 పెన్షన్లను లబ్దిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.

కోవిడ్ నేపథ్యంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చేస్తున్న కృషికి అండగా నిలిచి 10వేల మాస్కులు అందించిన సింగపూర్ లో సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్న వెంకటాచలం మండలం, గుడ్లూరివారిపాళెం పంచాయతీ వెంకట రెడ్డి పాళెం గ్రామానికి చెందిన మురళీకృష్ణా రెడ్డి.

స్క్రోలింగ్ పాయింట్స్:

👉 ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా అనేక వ్యాధులకు వైద్యం అందించడంతో పాటు, ప్రత్యేకంగా వైద్యం అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

👉 కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక విడతలుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం.

👉 ఇప్పటికే అనేక విడతలుగా ముఖ్యమంత్రి సహాయ నిధిని మంజూరు చేయించి, ప్రస్తుత పరిస్థితులలో కూడా 77 మందికి 43.5 లక్షల రూపాయలు అందించాం.

👉 పెన్షన్ల విషయంలో పార్టీలకతీతంగా, నెలవారి పెన్షన్లు మంజూరు చేస్తూ, నూతనంగా 383 పెన్షన్లు మంజూరు చేసి, పంపిణీ చేపట్టాం.

👉 ఆనందయ్య ఆయుర్వేద మందు కు ముఖ్యమంత్రి అనుమతులు మంజూరు చేయడంతో నా కుటుంబ సభ్యులైన సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకు ఆనందయ్య ఆయుర్వేద మందును తయారు చేసి, పంపిణీ చేస్తాం.

👉 ఆయుర్వేద మందు పై అనేక అబాండాలు వేస్తూ, ప్రజలను రెచ్చగొడుతూ, మందు పంపిణీని అడ్డుకుంటున్న కొంతమందికి, ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేక చాలా బాధపడుతున్నారు.

👉 కరోనా నేపథ్యంలో అనేక సందర్భాలలో సహాయసహకారాలు అందించి, ప్రస్తుత పరిస్థితులలో 10వేల మాస్కులు అందించిన మురళీ కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Total Page Visits: 26 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed