SGS TV Telugu

24×7 News

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పల్లపోతుల సుబ్బారావు మృతి*

1 min read

కాంగ్రెస్ సీనియర్ నాయకులు పల్లపోతుల సుబ్బారావు (88)అనారోగ్యంతో మృతి చెందారు.ఈయనకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో రాజానగరం జి ఎస్ ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో గురువారం రాత్రి మరణించారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు , ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు శ్రీనివాసరావు వ్యాపారరీత్యా గుంటూరు లో స్థిరపడ్డారు. సుబ్బారావు కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా పార్టీ లోని పలు ముఖ్య పదవులను నిర్వహించారు. ఏసీవై రెడ్డి, చల్లా అప్పారావు, జక్కంపూడి రామ్మోహన్ రావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ లతో మంచి సాన్నిహిత్యం గా మెలిగారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను , సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేసి ప్రశంసలు పొందారు . గాంధీ పురం ప్రకాష్ నగర్ సొసైటీలకు ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. అప్పట్లో అందరి సమన్వయంతో ఆ రెండు ప్రాంతాల అభివృద్ధికి శ్రమించారు. గౌతమీ జీవ కారుణ్య సంఘానికి డైరెక్టర్ గా, సీనియర్ సిటిజన్ మెంబర్గా పలు పదవులు నిర్వహించి తన వంతు గా సేవలందించారు. అందరికీ తలలో నాలుకగా మెలిగిన సుబ్బారావు కరోనాతో మృతి చెందడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, రాష్ట్ర నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కల్యాణోత్సవం ప్రకాష్ రావు, పంతం కొండలరావు, కందుల దుర్గేష్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, బళ్ళ సత్యవతి శ్రీనివాస్ , జక్కంపూడి అర్జున్ తదితర నగర ప్రముఖులు, కాంగ్రెస్ తో పాటు వివిధ పార్టీల నాయకులు, బంధుమిత్రులు ఆయనకు ప్రగాఢ సంతాపం తెలిపారు

Total Page Visits: 41 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *