కరోనా కట్టడి లో పోలీసులకు సహకరించండి..! జిల్లా ఎస్పీ .సత్య ఏసుబాబు

1 min read

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు

మానవాళి పై మరణ మృదంగం వాయిస్తూ ఉధృతమవుతున్న కరోనా సెకండ్. వేవ్ లను కట్టడి చేయడంలో భాగంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ సత్యయేసు బాబు సూచించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో పోలీసులు తీసుకుంటున్న కర్ఫ్యూ అంశాలను పనితీరును పరిశీలించడానికి ఆయన మంగళవారం సాయంత్రం మడకశిర ను సందర్శించారు. ఈ సందర్భంలో మార్గంమధ్యలో రాజీవ్ గాంధీ సర్కిల్ లో కొద్దిసేపు మాస్కులు లేకుండా వచ్చే వారిపై నిఘా ఉంచి పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరులతో జిల్లా సత్య ఏసుబాబు మాట్లాడుతూ: – అంక్షాలను ఉల్లంఘించి సంచరించే వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారిపై కేసు నమోదు చేయడంతోపాటు వారు ఉపయోగించిన వాహనాలను సైతం సీజ్ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.ఇందులో భాగంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలులో భాగంగా మధ్యహ్నాం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల దుకాణాలు మూసేయించాలన్నారు. ఆటోలు, టాక్సీలు, తదితర ప్రజా రవాణా అనుమతించరాదన్నారు. వైద్య సేవలు, అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. నిత్యావసరాలు, కూరగాయలు, తదితరాలు కర్ఫ్యూ కంటే ముందే తెచ్చుకునేలా ప్రజలకు సూచించాలన్నారు. ఆసమయంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం, భౌతిక దూరం పాటించేలా పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం ద్వారా తెలియజేయాలన్నారు. జన సమూహాలు లేకుండా చూడాలన్నారు. కర్ఫ్యూ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలు, వాహనాలపై జరిమానాలు లేదా కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లా ఎస్పీతో పాటు పెనుకొండ డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషా, సి.ఐ .రాజేంద్రప్రసాద్ . ఎస్సై. శేషగిరి. తదితరులు ఉన్నారు.

Total Page Visits: 40 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed