కరోనా కట్టడిపై కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష

1 min read

అమరావతి: అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ కార్యక్రమాలు, పథకాలతో పాటు కరోనా కట్టడి చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్షించారు. కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైఎస్సార్ జలకళ, ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాల ప్రగతిని సీఎం జగన్‌ తెలుసుకున్నారు. వైఎస్సార్ అర్బన్, రూరల్ హెల్త్‌ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలపై సమీక్షించారు. 
అనంతరం ఖరీఫ్ సన్నద్ధత, ఎరువులు, విత్తనాల అందుబాటుపై అధికారులతో సీఎం జగన్‌ చర్చించారు. ఖరీఫ్‌లో వ్యవసాయ రుణాలపై సమీక్షించారు. వీటితో రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలపై అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Total Page Visits: 22 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed