కరోనాతో మృతి చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి దహన సంస్కారాలు నిర్వహించిన ఏ కొండూరు పోలీసులు

1 min read

కృష్ణా జిల్లా

ఏ కొండూరు మం మాధవరం

పరిమళించిన మానవత్వం

కరోనాతో మృతి చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి దహన సంస్కారాలు నిర్వహించిన ఏ కొండూరు పోలీసులు

ఎస్సై టి.శ్రీనివాస్ పోలీసు సిబ్బంది సహకారంతో అంతిమ సంస్కారాలు గావించారు

కన్న బిడ్డలే కాదన్నా, సొంత కొడుకుల్లా పోలీసులు ఆదరించి, ముందుకొచ్చి కరోనా తో మృతి చెందిన వృద్ధుడికి దహన సంస్కారాలు నిర్వహించారు

వివరాల్లోకి వెళితే ఏ కొండూరు మండలం మాధవరం గ్రామంలో నివాసం ఉంటున్న జూవ్వజి వెంకయ్య అనే వృద్ధుడు గత రాత్రి కరోనాతో మరణించాడు

మృతుడు వెంకయ్య ఇంట్లో కొడుకు కోడలు నివాసం ఉంటుండగా

కుమారుడు వయస్సు 50 సంవత్సరాలు పైనే కాగా ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్న కుమారుడికి కనీసం గ్రామస్తులు, చుట్టుపక్కల ఇరుగుపొరుగు వారు కరోనా భయంతో ఎటువంటి సహాయ సహకారాలు అందించలేని వైనం

మానవత్వం మరచి దహనసంస్కారాలు చేసేందుకు వెళితే ఎక్కడ తమను కరోనా వైరస్ చుట్టుముడుతుందో అని భయభ్రాంతులకు గురై, కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా రాని గ్రామ ప్రజలు

సమాచారం అందుకున్న ఏ. కొండూరు ఎస్సై టి. శ్రీనివాస్ ధైర్యంతో సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి ఏ కొండూరు పోలీస్ సేష్టన్ సిబ్బంది, సహకారంతో ఎస్సై గారు సొంత కొడుకులా దహనసంస్కారాలు చేసేందుకు ముందుకు వచ్చారు

భౌతిక కాయాన్ని ఖననం చేసే క్రమంలో PPE కిట్లు, గ్లౌజులు, మాస్కులు విధిగా ధరించి, మృతుని సొంత భూమిలో కర్మకాండలు నిర్వహించి, సొంత బంధువుల్లా దహన సంస్కారాలు నిర్వహించి, గ్రామస్తుల మన్ననలు పొందిన ఏ కొండూరు పోలీసులు

ఈ దహన సంస్కారాలు మాధవరం గ్రామ సర్పంచి భర్త అయిన కుక్కల వైకుంఠరావు సహాయ సహకారాలు అందించగా కుమారుడు కూడా అంతిమ సంస్కారం లో పాల్గొని కన్నీటిపర్యంతమయ్యారు

ఈ దహన సంస్కారాలు కార్యక్రమం లో కానిస్టేబుళ్లు భాష పాపారావు డ్రైవర్ పవన్ లు పాల్గొన్నారు

Total Page Visits: 78 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed