కడప నగరంలో కర్ఫ్యూ అమలును పరిశీలించిన జిల్లా ఎస్పీ గారు..

1 min read

కడప జిల్లా:

➡️ అత్యవసరమైతేనే బయటకు రావాలి.. అనవసరంగా రోడ్లపై తిరగవద్దని ప్రజలకు సూచన..

➡️ జిల్లా కేంద్రమైన కడప నగరంలోని వై.వి స్ట్రీట్ లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ పర్యటించి కర్ఫ్యూ ఆంక్షలు అమలు పరిస్థితిని పరిశీలించారు. ఇందులో భాగంగా… వై.వి స్ట్రీట్ లో కర్ఫ్యూ పరిస్థితులను వీక్షించారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. అన్ని రకాల వ్యాపార దుకాణాలు/ సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 గంటల వరకు తెరవకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. అత్యవసర సర్వీసులు, ఆసుపత్రులు, ఫార్మసీలను మినహాయించాలన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు పక్కాగా కొనసాగాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్.పి గారి వెంట కడప వన్ టౌన్ సి.ఐ టి.వి సత్యనారాయణ ఉన్నారు.

Total Page Visits: 19 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed