ఒక్క స్కూలూ మూతపడకూడదు: జగన్‌ ఆదేశం

1 min read


  • అమరావతి: పాఠశాల విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణల వల్ల రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడకూడదని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. విద్యా వ్యవస్థ మరింత ప్రభావవంతంగా మారేలా కార్యాచరణను అమలు చేయాలని అధికారులకు సూచించారు. స్కూళ్ల నిర్వహణ, టీచర్ల వినియోగంలో జాతీయ ప్రమాణాలు పాటించాలన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, అంగన్‌వాడీల్లో నాడు-నేడుపై ఆయన సమీక్షించారు. పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండాలన్నారు. విద్యార్థులు తక్కువ.. టీచర్లు ఎక్కువ ఉన్న పాఠశాలల్లో అంగన్‌వాడీ పిల్లలను కలుపుకొనేలా చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అవకాశం ఉన్నచోట మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్నత పాఠశాల పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. అధికారుల ప్రతిపాదనలు పరిశీలించిన సీఎం.. రాష్ట్రంలో ప్రతి పాఠశాల వినియోగంలో ఉండాలన్నారు.

అవసరమైనచోట అదనపు గదులు నిర్మించాలని సీఎం ఆదేశించారు. పిల్లలకు 2కి.మీల దూరం లోపలే బడి ఉండాలన్నారు. పాఠశాలల నిర్వహణలో జాతీయ ప్రమాణాలను పాటించాలని సూచించారు.

Total Page Visits: 56 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed