ఒంగోలులో ఒక హాస్పిటల్‌కు 8లక్షల జరిమానా

1 min read

నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీకి
50 శాతం బెడ్లు ఇవ్వాల్సిందే
జిల్లా క్రమశిక్షణ కమిటీ
సమావేశంలో నిర్ణయం

ఒంగోలులో కొవిడ్‌ అనుమతి పొందిన ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ నిబంధనలను పాటించకపోవడంతో జరిమానా విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని జేసీ-2 ఛాంబర్‌లో శుక్రవారం జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశానికి జేసీ చేతన్‌ అధ్యక్షత వహించారు. ముందుగా సమావేశంలో ఆరోగ్యశ్రీ అనుమతి ఉన్న ప్రైవేటు వైద్యశాలల్లో కరోనా పేషెంట్లకు బెడ్ల కేటాయింపుపై చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్కడ ఉన్న బెడ్లలో ఆరోగ్యశ్రీ పేషెంట్లకు 50శాతం కేటాయించకపోవడం సమావేశంలో చర్చకు వచ్చింది. నిబంధనల విరుద్ధంగా ఆ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ వైద్యం అందించనందుకు డిసిప్లినరీ యాక్షన్‌ కింద రూ.8లక్షలు జరిమానా విధిస్తూ నిర్ణయించారు. డీఎంహెచ్‌ఓ రత్నావళి, డీసీహెచ్‌ఎ్‌స కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఉషా, ఐఎంఏ అధ్యక్షుడు మన్నే వీరయ్యచౌదరి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌లు ఉన్నారు.

Total Page Visits: 29 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed