ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌

1 min read

ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం పేర్కొన్నారు. మనం కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని ఆయన పేర్కొన్నారు. రూరల్‌ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వారికి ఆదుకునేలా ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

Total Page Visits: 134 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed