ఎమ్మెల్యే అమర్ పిలుపు కు విరాళాల వెల్లువ…
కరోనా కాటుకు విలవిల్లాడుతూ,

1 min read


ఆక్సిజన్ అందక గాల్లో కలుస్తున్న ప్రాణాలు నిలబెట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ముందుకొచ్చారు. కరోనా బాధితుల కోసం తన వంతు సాయంగా ఐదు లక్షల రూపాయలను ప్రకటించి విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనాతో బాధపడుతూ స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషంట్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ వివరాలు స్వయంగా పరిశీలించి వారికి కావలసిన సదుపాయాలను సమకూర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అనకాపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కొరోనా విజృంభించి కొరోనా పేషెంట్స్ పెరుగుతున్న నేపథ్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బెడ్స్ కోసం తన వంతు సాయంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించి, విరాళాల సేకరణకు అమర్ ఇచ్చిన పిలుపుకి స్పందించి స్థానిక ప్రజలు, నాయకులు, కంపెనీలు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ సమయంలో ముందుండి ప్రజలకు ఎంతో సహాయం అందించిన వైయస్సార్ సిపి స్థానిక నాయకుడు పలకా రవి లక్ష రూపాయల సాయాన్ని అందించారు. రాంకొ సిమెంట్స్ 30 లక్షలు, శెట్టినాడు సంస్థ 5 లక్షలు, సాగర్ సిమెంట్స్ 7.5 లక్షలు, అరబిందో 10 లక్షలు, లారస్ 5 లక్షలు, ఎం.ఎస్.రావు షాపింగ్ మాల్ 2లక్షలు, ముప్పన షాపింగ్ మాల్ 2 లక్షలు విరాళాలు అందించారు. గురువారం నాటికి విరాళాలు మొత్తం 57 లక్షల 50 వేల రూపాయలకు చేరుకుంది. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్థానిక ప్రజలు తోడు అవ్వడం చాలా ఆనందదాయకమని అన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కరోనా మరణాలకు చెక్ పెట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. విశాఖలో ఉన్న కేజిహెచ్ తర్వాత అనకాపల్లి ప్రభుత్వాసుపత్రి విశాఖ రూరల్ జిల్లా ప్రాంత ప్రజలకు చాలా ముఖ్యమని, అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించడం తన ముందున్న కర్తవ్యం అని అన్నారు. తన పిలుపుకు స్పందించి విరాళాలు ఇస్తున్న నాయకులకు వ్యాపారస్తులకు కంపెనీ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే అమర్ కి అండగా వైఎస్ఆర్ సిపి అనకాపల్లి టౌన్ అధ్యక్షుడు మందపాటి జానకి రామ రాజు, అనకాపల్లి రూరల్ అధ్యక్షుడు గొర్ల సూరి బాబు, జాజుల రమేష్, పలక రవి, కొణతాల మురళీకృష్ణ స్థానిక నాయకులు కార్యకర్తలు అండగా నిలబడ్డారు

Total Page Visits: 32 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed