SGS TV Telugu

24×7 News

ఎంపి భరత్ రామ్ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు ఉండాలి

1 min read

కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందివ్వాలి

_వైద్యాధికారులకు ఎంపి భరత్ రామ్ సూచన
తూర్పు గోదావరి జిల్లా
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 28:

రెండవ అల కరోనా మహమ్మారి కారణంగా పెరుగుతున్న రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, అందుకు తగ్గ ఏర్పాట్లను సత్వరమే చేయాలని జిల్లా వైద్య శాఖాధికారులకు రాజమహేంద్రవరం ఎంపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ ఆదేశించారు.

బుధవారం వైద్య శాఖాధికారులతో ఎంపి భరత్ రామ్ ఈ అంశంపై చర్చించారు.

రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజక వర్గ పరిధిలో ఎక్కడెక్కడ ఏయే ఆసుపత్రుల్లో కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు, ఎంత మంది రోగులు ఆసుపత్రులలో వైద్య సేవలు పొందుతున్నారు..హౌస్ క్వారంటైన్ రోగులు ఎంతమంది ఉన్నారు తదితర వివరాలను జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ రమేష్ కిషోర్, డిప్యూటీ డిఎం హెచ్వో డాక్టర్ కోమలి తదితర వైద్యాధికారులను ఎంపి భరత్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం క్వారీ కెనాల్ రోడ్డు ఈ సీఎం హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న క్వారంటైన్ సెంటర్ ను ఎంపి ఆకస్మికంగా సందర్శించారు.

చర్చ్ ఆఫ్ క్రీస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ జయదేవ్ పర్యవేక్షణలో పలువురు ఫిజీషియన్స్ ఈ క్వారంటైన్ సెంటర్ ను నిర్వహిస్తున్పారు.

అక్కడ డాక్టర్ జయదేవ్, డాక్టర్ రమేష్ కిషోర్, డిప్యూటీ డిఎం హెచ్ వో డాక్టర్ కోమలి తో కలిసి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులు కూడా తమకందుతున్న వైద్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

వాడిన పీపీఈ కిట్లను ఎక్కడ పడితే అక్కడ కాకుండా నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే వేయాలని, ఇష్టమొచ్చినట్టు పారవేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని సంబంధిత ఆసుపత్రి నిర్వాహకులకు ఎంపి భరత్ తెలిపారు.

కార్యక్రమంలో ఎంపి భరత్ రామ్ తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/dJ2Pud4pt1E
.

Total Page Visits: 16 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *