ఋజువు కానిదే మందు పంపిణి చేయరాదు- JANA VIGNANA VEDIKA(AP)

1 min read

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేదం పేరుతో జరుగుతున్న కరోనా మందు పంపిణికి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధుల వైఖరిని జనవిజ్ఞాన వేదిక(ఆం.ప్ర) రాష్ట్రకమిటి తీవ్రంగా ఖండిస్తుందని జె.వి.వి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.త్రిమూర్తులు, ఎస్.ఎన్.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి ఆయుర్వేదం పేరుతో కరోనా రోగులకు పంచుతున్న మందుని ICMR CCMB లాంటి సంస్థలలో అధ్వర్యంలో మందుని పరీక్షించి ఋజువైన తరువాతే మందు పంపిణి జరగాలని అంతవరకు ఆపాలని అధికారులు ఇచ్చిన ఆదేశాలను స్థానిక ప్రజాప్రతినిధులు బేఖాతరు చేయడం సరైనదికాదన్నారు. ఆధునిక వైద్యం ప్రజలకు అందుబాటులో లేకపోవడంవల్ల ఇటువంటి అశాస్త్రీయమైన వైద్యవిధానాలపై ప్రజలకు ఆశక్తి పెరుగుతుందన్నారు. కరోనా నుండి బయటపడటానికి ప్రజలకు వ్యాక్సిన్, ఆక్సీజను బెడ్లు అందుబాటులో లేక, ప్రైవేటు వైద్యం అత్యంత ఖరీదు అవడం మరో ప్రత్యామ్నాయం కనపడకపోయడం వల్ల నిరూపణ కాని ఇలాంటి వైద్యవిధానంవైపు మొగ్గు చూపుతున్నారని, ప్రజాప్రతినిధులు దీనిని సమర్ధించడం చాలా దారుణం అన్నారు. సదరు మందు తయారు చేసిన వ్యక్తి ఎటువంటి వైద్యవిద్యను అభ్యసించినవారు కాదు అలాంటి వ్యక్తి వైద్యం చేయడం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదమే కాకుండా నేరం కూడా అని వారు అవేదన వ్యక్తం చేసారు. ఆయుర్వేద మందు తీసుకోవడంవల్ల సైడ్ ఎఫెక్ట్ రావడంలేదు అని చేబుతున్నా కంట్లో వేస్తున్న మందువల్ల కోన్ని సమస్యలు ఎదురౌతున్నాయంటున్నారని వారు తెలిపారు.
వేలాదిమంది కృష్ణపట్నం రావడం వల్ల కరోనా తగ్గడం అటుంచి భారీగా కరోనా వ్యాప్తి జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ICMR, CCMB సంస్థలనుండి రిపోర్టులు త్వరగా తెప్పించుకుని మందు ఉపయోగపడుతుందని తేలితే అందుకు తగిన ఏర్పాట్లు చేయించాలని లేని పక్షంలో తక్షణమే పంపిణిని నిలుపుదల చేయించాలని కోరారు.
జనవిజ్ఞాన వేదిక ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న అతిపెద్ద ప్రజాసైన్స్ సంస్థగా దేనిని గుడ్డిగా వ్యతిరేకించదని అదేవిధంగా ఋజువులేకుండా దేనిని ఆమోదించదన్నారు.

కె.త్రిమూర్తులు, అధ్యక్షులు, 79972 32443
ఎస్.ఎన్.రమేష్, ప్రధాన కార్యదర్శి 9490098539

Total Page Visits: 46 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed