SGS TV Telugu

24×7 News

ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ వల్ల తన తండ్రి ప్రాణాలు విడిచారు

1 min read

నాన్నకు ‘నెగెటివ్‌’ వచ్చింది: సబ్బం తనయుడు

విశాఖ: మాజీ ఎంపీ సబ్బం హరి ఈ మధ్యాహ్నం 1.22గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆయన తనయుడు వెంకట్‌ వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ వల్ల తన తండ్రి ప్రాణాలు విడిచారని తెలిపారు. చికిత్స తర్వాత ఆయనకు కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చిందన్నారు. మంగళవారం ఉదయం 9గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెదేపా అధినేత చంద్రబాబు నిత్యం తన తండ్రి ఆరోగ్యంపై వివరాలు అడిగేవారన్నారు. ఈ కష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ వెంకట్‌ కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్‌ వేళ అంత్యక్రియలకు ఎవరూ రావొద్దని కోరుతున్నామన్నారు.

మరోవైపు, సబ్బం హరి మరణంపై హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విశాఖ అభివృద్ధికి ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Total Page Visits: 29 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *