ఈ అంబులేన్సు కు ప్రాణం పోయడి

1 min read

ఈ అంబులేన్సు కు ప్రాణం పోయడి

అంబులేన్సు కు ప్రాణం పోసి ప్రజల ప్రాణాలుకాపాడమంటూ
మాజీ అధ్యక్షురాలు శ్రీమతి పులగం.దుర్గా భవాని

ఈ అంబులెన్స్కు ప్రాణం పోసి ప్రజల ప్రాణాలుకాపాడమంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి పులగం.దుర్గా భవాని దాతలకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ మండల కేంద్రమైన సఖినేటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2018లో చమురు సహజ వాయువు సంస్థ సుమారు పది లక్షల రూపాయలతో అంబులెన్స్ వాహనాన్ని బహుకరించిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ గా తాను ఈ అంబులెన్స్ నిర్వహణకు కృషి చేసినట్లు ఆమె చెప్పారు. వాహనాన్ని సమకూర్చిన చమురు సహజ వాయు సంస్థ దాని నిర్వహణకు నిధులు మంజూరు చేయకపోవడంతో దాతల సహకారంతో, తన సొంత సొమ్ముతో కొంతకాలం ఈ అంబులెన్స్ నిర్వహణ చేశామన్నారు. నెలకు పదివేల రూపాయలు ఈ అంబులెన్స్ నిర్వహణకు ఖర్చు అవుతోందని, నిధులులేకపోడం, పట్టించుకున్న వారు లేకపోవడంతో ఆనాటినుండి ఈ వాహనం మూలకు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న ఈ పరిస్థితుల్లో ఉన్న ఈ వాహనాన్ని బాగు చేయించి వాడుకలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఏ సమావేశంలో రమేష్ కూడా పాల్గొన్నారు.

Total Page Visits: 63 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed