SGS TV Telugu

24×7 News

ఇంటర్, 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలి అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి

1 min read

ఇంటర్, 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలి అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ని డిమాండ్ చేశారు…

ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలం అవుతుంటే ఆంధ్రప్రదేశ్లోనే పదో తరగతి ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలకు పోవడం నీరో పాలనని తలపిస్తుందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి బాలాజీ అన్నారు.

ఆంధ్రప్రదేశ్లో 6.3 లక్షల మంది పదో తరగతి 10.6 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షల కోసం ఉన్నారని, ప్రస్తుతం ఉన్న కరోన విపత్కర పరిస్థితులలో పరీక్షలు రద్దు లేదా రెండు నెలల పాటు వాయిదా వేయాల్సిన అవసరం ఉందని బాలాజీ అన్నారు..

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 122 మంది ఉపాధ్యాయులు చనిపోయినట్లుగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య రాతపూర్వకంగా గురువారం రాష్ట్ర పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ కి సంఘం తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగిందని బాలాజీ అన్నారు.

నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తున్నా నాయకులు, విద్యార్థుల ప్రాణాల్ని ప్రాణంగా పెట్టి పరీక్షలు నిర్వహించాలని కోరడం అవివేకమని ఆయన అన్నారు. ప్రస్తుతం హాస్పిటల్స్ స్మశానాలు ఖాళీ లేక సామాన్యుడు అతలాకుతలం అవుతుంటే, పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారని బాలాజీ ప్రశ్నించారు.

ప్రజలని భౌతిక దూరం పాటించండి అని చెప్పిన ప్రభుత్వాలు ఇవాళ లక్షలాది మంది విద్యార్థులను పరీక్ష కేంద్రాలు తరలించడం సరైన చర్య కాదన్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా రోడ్డు మీదికి రావాల్సిన పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే పదో తరగతి ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని బాలాజీ డిమాండ్ చేశారు.

ప్రస్తుత పరిస్థితులలో హాస్పిటల్స్ వద్ద వీధుల్లో శానిటేషన్ చేసే పరిస్థితి కూడా లేదని, అటువంటిది 1,452 పరీక్షా కేంద్రాల వద్ద శానిటేషన్ చేయడం అసంభవం అన్నారు…బడ్జెట్ కేటాయింపులు ఎక్కడ అని బాలాజీ ప్రశ్నించారు.

రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారని, అతి, పేద సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువు తున్నారని, వారి ప్రాణాలతో చెలగాటం రాజకీయ క్రీడా అని బాలాజీ అన్నారు.

*ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా పరీక్షలు రద్దు లేదా వాయిదా కోరుతూ ఉంటే ముఖ్యమంత్రి స్పందించకపోవడం శోచనీయం అని బాలాజీ అన్నారు.

తక్షణమే టెన్త్ ఇంటర్ పరీక్షలు వాయిదా వేసి విద్యార్థుల తల్లిదండ్రుల ప్రాణాలను సైతం రక్షించాలని బాలాజీ డిమాండ్ చేశారు.

Total Page Visits: 32 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *