SGS TV Telugu

24×7 News

ఆన్లైన్ లో శ్రీవారి సేవలు

1 min read

గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆన్లైన్ ద్వారా పరోక్షంగా స్వామివారి సేవలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు పెద్దింటి రాంబాబు తెలిపారు. బుధవారం ఆలయంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ కరోనా కారణంగా అంతరాలయ దర్శనం నిలుపుదల చేసి బయట నుంచి స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. చైర్మన్ సుధాకర్రావు, ట్రస్టు బోర్డు సభ్యుల నిర్ణయం మేరకు నిత్యార్జిత కల్యాణం, గరుడోత్సవం, నిత్యార్జిత శేష వాహనోత్సవం, స్వర్ణతులసి దళార్చన సేవలను ఆన్లైన్ ద్వారా నమోదైన భక్తులు వీక్షించవచ్చునని తెలిపారు. మే 22 నుంచి 29 వరకు జరిగే శ్రీవారి వైశాఖ మాస తిరుకల్యాణోత్సవాలు నిర్వహిస్తామన్నారు. .

Total Page Visits: 8 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *