ఆనందయ్యను సత్కరించి

1 min read

ఆనందయ్యను సత్కరించి
ప్రకాశంలో మందుల పంపిణీ కోరిన మాగుంట ఆనందయ్య గారి పీ, యల్, మరియు యఫ్. నోటిద్వారా వేసుకొనే ఉచిత మందుల పంపిణీకి మన ముఖ్యమంత్రి, గౌ శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిగారు అనుమతించిన సందర్భంగా ఈ రోజు ఒంగోలు పార్లమెంటు సభ్యులు, గౌ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిగారు నెల్లూరులో ఆయన ఇంటివద్ద ఆనందయ్యగారిని కలసి ఆయనను అభినందించి ఈ రోజు మనందరికీ చాలా ఆనందదాయకమైన రోజని అన్నారు. ప్రజలకు ఎటువంటి అపోహలు లేకుండుటకు - కొంత ఆలశ్యం జరిగినా మన ముఖ్యమంత్రి, గౌ శ్రీ వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డిగారు ఒక కమిటీని ఏర్పాటు చేసి పరిశోధనలు జరిపించి ఆనందయ్య ఉచిత మందులకు అనుమతి ఇవ్వడం మరియు మందులను ప్రజలకు పంపిణీ చేయవలసినదిగా ఆనందయ్య గారిని కోరడం చాలా సంతోషదాయకరమైన విషయమన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచలో నలుమూలలా ప్రజలను వణికించే సమయంలో ఆనందయ్య ప్రజలకు మందులు ఉచితంగా పంపిణీ చేయడం, ఆ మందుల కోవిద్ వ్యాధి గ్రస్తులకు కూడా ఉపశమనం కలిగించడం మన రాష్ట్ర ప్రజలతో పాటు ప్రక్క రాష్ట్రాల ప్రజలు మరియు పెద్ద పెద్ద ప్రపంచ దేశాల ప్రజలు కూడా ఆయన మందులు కోరుకోవడం మన రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు. ఆనందయ్య గారు మా మాగుంట కుటుంబంతో సన్నిహిత సంభందాలు కలిగిన వ్యక్తి అని, ఆనందయ్య గారు ఆయన మందులు ఇతోధికంగా తయారుచేయుటకు మా మాగుంట కుటుంబం ఆయనకు అన్నివిధాల సహరిస్తుందని తెలియజేశారు. మా మాగుంట కుటుంబం తరఫున శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారు, శ్రీమతి పార్వతమ్మ గారు మరియు నేను గత 30 సంవత్సరాలనుండి ప్రకాశం జిల్లాలో – ఒంగోలు పార్లమెంటు నియోజక వర్గ ప్రజల సేవలో ఉన్నామని, ప్రకాశం జిల్లాలోని నల్లమల అడవులలో ఆనందయ్యగారి మందులకు కావలసిన మూలికలు – వస్తువులు పుష్కలంగా లభ్యమగునని, వాటి సరఫరాకు తాను తప్పక కృషిచేస్తానని, కనుక ఆనందయ్య గారిని ఒంగోలుకు వచ్చి మందులు తయారు చేసి ప్రకాశం జిల్లా ప్రజలకు ఉచితంగా అందించాలని, దానికి అన్ని విధాలా సహరించుటకు మా మాగుంట కుటుంబం ముందు ఉండగలదని శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఆయనను కోరినారు. ఈ సందర్భంగా ఆనందయ్య గారు మాట్లాడుచూ, ఒంగోలులో జరిగిన డి. ఆర్. సి. సమావేశంలో రాష్ట్ర మంత్రులకు మరియు జిల్లా కలెక్టరు గారికి తను తయారు చేసిన మందులు అందజేసి వాటి విశిష్టతను గురించి శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు తెలియజేయడం తనకు చాలా ఆనందం కలిగించినదని, తన మందులు పంపిణీకి సహరించినందుకు భారత ఉప రాష్ట్రపతి, గౌ శ్రీ యం. వెంకయ్యనాయుడుగారికి రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌ శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు, శ్రీ కాకాని గోవర్ధనరెడ్డి గారికి, నెల్లూరు జిల్లా మంత్రులకు మరియు ఒంగోలు పార్లమెంటు సభ్యులు, శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రకాశం జిల్లాకు వచ్చి కోవిద్ మరియు తదితర వ్యాధిగ్రస్తులకు తన మందులు ఉచితంగా పంపిణీచేస్తానని ఆనందయ్య గారు తెలియజేశారు. ఆనందయ్య గారు ఉచితంగా మందులు ప్రజలకు అందించుచున్నందున మనమందరం సహాయ సహకారాలు అందించాలని – ఈ మందుల తయారి మరియు అన్ని జిల్లాలలో పంపిణీ చేయడంలో మన ముఖ్యమంత్రి, గౌ.శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిగారు కూడా తప్పక సహరిస్తారని శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిగారు తెలిపారు.

Total Page Visits: 70 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed