ఆంధ్రప్రదేశ్చర్చనీయాంశంగా ఆనందయ్య మందు కవర్.. మా ఇష్టమన్న కాకాణి

1 min read


నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని గొలగముడి ఆలయం వద్ద ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఆనందయ్య మందు కవర్‌పై వైసీపీ రంగులతో పాటు ఆ పార్టీ నేతల ఫోటోలు దర్శనమివ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ను ప్రశ్నించగా.. వైసీపీ రంగులతో పాటు తమ ఫోటోలు వేసుకోవడం తమ ఇష్టమని తెలిపారు. ఇంకా కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మా నిధులు ఖర్చుపెట్టి తయారు చేయించి పంచుతున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో 1.80 లక్షల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నాం. అలా దాదాపు 3 లక్షల మందికి మందు అందించనున్నాం. కరోనా కష్టకాలంలో ఆనందయ్య మందు తయారు చేయడం సంతోషం. ప్రభుత్వ అనుమతులు రాగానే మొదట సర్వేపల్లి మందు ఇవ్వాలి అనుకున్నాం. అందుకే ఒకటిన్నర లక్షల ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నాం. మందు ప్యాకెట్‌ను ప్రతి కుటుంబానికీ ఇస్తాం. వలంటీర్ల ఆధ్వర్యంలో కుటుంబాలకు చేరుస్తాం. మందు పంపిణీని రాజకీయం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలి. ఆనందయ్య మందుపై నేను అవినీతికి పాల్పడి ఉంటే నా కుటుంబం నాశనం అవుతుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ పూర్తి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తాం’’ అని తెలిపారు.

Total Page Visits: 131 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed