అభివృద్ధే లక్ష్యంగా , మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాలను 99 శాతం సీఎం జగన్ పూర్తి చేశారు

1 min read

పెనుమంట్ర ( ప్రతినిధి)
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పోడూరు మండలం తూర్పు పాలెం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు జెండా ఆవిష్కరణ చేసి మీడియాతో మాట్లాడారు.ప్రపంచ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజల్లో సమస్యలు తెలుసుకునేందుకు గ్రామ వాలంటీర్  వ్యవస్థను ఏర్పాటు చేశారు.అభివృద్ధే లక్ష్యంగా , మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాలను 99 శాతం సీఎం జగన్ పూర్తి చేశారు.కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సమన్యాయం చేస్తూ,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తోంది.కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి,సంక్షేమం అమలు చేస్తున్నామని,అన్ని వర్గాలకు సమానంగా సంక్షేమ ఫలాలు అందించామని పేర్కొన్నారు.భారత చరిత్రలో ఒకేసారి ముపై లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించి ముపై వేల కోట్ల రూపాయలతో ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టామన్నారు.జూన్ మొదటి తేదీన మొదటి విడతగా పదిహేడు లక్షల అరవై వేల మందికి కట్టించి ఇవ్వ బోతున్నామని తెలిపారు.ఆచంట నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.విద్యావ్యవస్థలో  నాడు-నేడు కార్యక్రమం ఏర్పాటు చేసి పేద విద్యార్దులకు కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులోకి తీసుకు వచ్చారు.ప్రతి పార్లమెంట్ స్థాయిలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం.తొందర్లోనే పాలకొల్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నాం. సోమవారం పదహారు మెడికల్ కాలేజీలకు సీఎం జగన్ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేస్తున్నారు.విద్య, వైద్యం అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ప్రభుత్వం భావిస్తోంది.అప్పుల భారం పడకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు సీఎం జగన్ నడిపిస్తున్నారు.

Total Page Visits: 30 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed