అన్నాహత్య కేసులో తమ్ముడు అరెస్టు

1 min read

👉ప్రకాశం జిల్లా కొమరోలులో అన్నను హత్య చేసిన కేసులో తమ్ముడిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఎస్సైసాంబ శివయ్య. సీఐ ఫిరోజ్ మీడియాకు అందించిన సమాచారం మేరకు.

👉కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన పెసరపాటి బాలకృష్ణ మృతుడు పెసరపాటి గురువయ్య తెలంగాణ రాష్ట్రంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అని, ఈ క్రమంలో గురుస్వామి స్వప్న అనే అమ్మాయిని ప్రేమించి అక్కడే పెళ్లి చేసుకుని సుమారు 2 నెలల స్వగ్రామమైన ఎర్రగుంట్లకు వచ్చి అతని తల్లిదండ్రుల నివాసం ఉంటున్నారని,

👉గురుస్వామి చేసుకున్న అమ్మాయిది వేరే కులం కావడంతో, గురుస్వామి తమ్ముళ్లకు వారి వివాహానికి పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, తరచు అన్నతో గొడవ పడుతూ ఉండేవాడని. అన్నతో వెంటనే ఆఅమ్మాయిని ఇంటిలో నుంచి పంపించేయాలి అని తన అన్నతో వాదులాటకు దిగేవాడు అని.

👉ఈ క్రమంలో 5వ నెల 25వ తేదీన మృతుడు గురుస్వామి. తమ్ముడు బాలకృష్ణ మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, తమ్ముడు బాలకృష్ణ పై అన్న గురుస్వామి రోకలి బండతో తల వెనుకభాగంతో కొట్టి వెంబడించగా, అతనిపై కోపం పెంచుకున్న బాలకృష్ణ. స్థానికంగా ఉన్న కత్తిని తీసుకుని గురుస్వామి ఎడమ వైపు పొట్ట భాగంలో పొడిచి పారిపోయాడని, గాయపడ్డ గురుస్వామిని వైద్యం కోసం గిద్దలూరు తరలించి మెరుగైన వైద్యం కోసం కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించగా. 5వ నెల 27వ తేదీన గురుస్వామి మరణించాడని.

👉అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి 6 నెల 7వ తారీకు సాయంత్రం 5 గంటలకు ఎర్రగుంట్ల గ్రామం లోని పత్తికొండ స్వామి దర్గా వద్ద పరారీలో ఉన్న నిందితుడు బాలకృష్ణను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు గా సీఐ ఫిరోజ్ వెల్లడించారు. అలానే నిందితుడి వద్ద కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Total Page Visits: 36 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed