అత్యవసరమైతే పోలీస్‌ పాస్‌ తీసుకోండి..!

1 min read

  • రాష్ట్ర ప్రజలకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సూచన
  • ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ–పాస్‌ల జారీకి చర్యలు
  • జిల్లాల వారీగా పాస్‌ల కోసం వాట్సప్‌ నెంబర్లు, మెయిల్‌ ఐడీల వివరాలు విడుదల చేసిన డీజీపీ కార్యాలయం

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఈ–పాస్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఈ–పాస్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేశారు.

దీనికి సంబంధించి డీజీపీ తెలిపిన వివరాలివీ.
► లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న దృష్ట్యా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారికి పోలీస్‌ శాఖ ద్వారా అత్యవసర రవాణా పాస్‌లను జారీ చేస్తాం.
► జిల్లా పరిధిలో వెళ్లాల్సి వస్తే.. ఆ జిల్లా ఎస్పీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి.

  • వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తే.. తమ జిల్లా ఎస్పీ ద్వారా ఆ వ్యక్తి వెళ్లాల్సిన జిల్లా ఎస్పీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
    ► వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే.. సదరు వ్యక్తికి సంబంధించిన జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి.
  • వివరాలన్నీ పరిశీలించి ఆయా రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం డీఐజీ కార్యాలయం అనుమతి మంజూరు చేస్తుంది.
    ► పాస్‌ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి.
    ► పాస్‌ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
    ► దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్‌ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు.
  • ఈ–పాస్‌ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.

ALL UNIT OFFICERS WHATSAPP NUMBERS & Email id’S
S.No
Unit Name
WHATSAPP
Mobile Number
e-mail ID’s

  1. SRIKAKULAM
    6309990933 Whatsapp
    dail100srikakulam@gmail.com
  2. VIZIANAGARAM
    9989207326 Whatsapp
    spofvzm@gmail.com
  3. VISAKHAPATNAM RURAL
    9440904229 Whatsapp
    vizagsp@gmail.com
  4. VISAKHAPATNAM CITY
    9493336633 Whatsapp
    cpvspc@gmail.com
  5. EAST GODAVAI (KAKINADA)
    9494933233 Whatsapp
    sp@eg.appolice.gov.in
  6. RAJAHMUNDRY URBAN
    9490760794 Whatsapp
    sp@rjyu.appolice.gov.in
  7. WEST GODAVARI
    8332959175 Whatsapp
    policecontrolroomeluruwg@gmail.com
  8. KRISHNA (MACHILIPATNAM)
    9182990135 Whatsapp
    sp@kri.appolice.gov.in
  9. VIJAYAWADA CITY
    7328909090 Whatsapp
    cp@vza.appolice.gov.in
  10. GUNTUR RURAL
    9440796184 Whatsapp
    Dail100gunturrural@gmail.com
  11. GUNTUR URBAN
    8688831568 Whatsapp
    guntururbansp@gmail.com
  12. PRAKASHAM
    9121102109 Whatsapp
    spongole@gmail.com
  13. NELLORE
    9440796383 Whatsapp
    nelloresp@gmail.com
  14. CHITTOOR
    9440900005 Whatsapp
    spchittoor@gmail.com
  15. TIRUPATHI URBAN
    9491074537 Whatsapp
    sptpturban@gmail.com
  16. ANANTHAPURAM
    9989819191 Whatsapp
    spatp1@gmail.com
  17. KADAPA
    9121100531 Whatsapp
    spkadapa2014@gmail.com
  18. KURNOOL
    7777877722 Whatsapp
    spkurnool.kur@gmail.com
  • అత్యవసర పనుల కోసం పాస్‌లు తీసుకోదలచినవారు తమ యొక్క వినతిపత్రాలను పైన ఇచ్చిన వాట్సప్‌ మొబైల్ నెంబర్లకు మరియు మెయిల్ ఐడీలకు మాత్రమే పంపగలరు. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్లకు/మెయిల్ కు అనుమతి పంపబడును. మీరు ప్రయాణించేటపుడు జిల్లాల యొక్క వాట్సప్‌ నెంబర్ మరియు మెయిల్ ఐడీల నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే అంగీకరించబడును. ఫార్వర్డ్‌ చేయబడిన అనుమతులు (పాసులు) అంగీకరించబడవు. మీరు ప్రయాణించేటప్పుడు మీతోపాటు మీయొక్క గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్‌) తప్పనిసరిగా ఉంచుకోవాలని డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Total Page Visits: 17 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed