ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన tv5 జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తాతాజీ మృతిపట్ల రావులపాలెం పాత్రికేయులు సంతాపం ప్రకటించారు.
స్థానిక పోలీస్స్టేషన్ సమీపంలో సీనియర్ పాత్రికేయుడు కుంపట్ల త్రిమూర్తులు, అధ్యక్షతన ఏర్పాటుచేసిన సంతాప సభలో పాత్రికేయులు,రావులపాలెం యస్.ఐ. పి.బుచ్చిబాబు పాల్గొని తాతాజీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ చిన్నవయసులో తాతాజీ దూరమవడం చాలా బాధాకరం అన్నారు, పాత్రికేయులందరితో తాతాజీ సత్సంబంధాలు కలిగి ఉండేవారని, పాత్రికేయునిగా వృత్తిపట్ల నిబద్ధతతో వ్యవహరించేవారని తెలిపారు. జర్నలిస్ట్ సంఘాల ద్వారానే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా తాతాజీ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు.
యస్.ఐ.బుచ్చిబాబు మాట్లాడుతూ వృత్తి పరంగానే కాకుండా వ్యక్తి గతంగా కూడా జర్నలిస్ట్ లు జాగ్రత్తలు పాటించాలని ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూసించారు.
ఈ కార్యక్రమంలో పమ్మి నరేష్,పెరవలి వెంకటేశ్వరరావు, బి.పి.డి.దత్తు,ఇరగవరపు వేణు గోపాల్,దారపరెడ్డి సత్యనారాయణ,గుత్తుల శ్రీనివాస్,భమిడిపాటి శ్రీనివాసరావు,కొండేటి గంగాధర్,గంట్రోతు సురేష్,కె.నాగరాజు,రామారావు,రాజు,కె.బి. వి.సత్యనారాయణ,ఉందుర్తి సురేష్,చింతారావు, దొండపాటి మూర్తి,పోలీసు సిబ్బంది మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here