తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామం లో నూతనంగా సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన పెయ్యల చిట్టిబాబు ఆధ్వర్యంలో సానిక సొసైటీ ఆఫీసు నందు రైతు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముమ్మిడివరం శాసన సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ వరద బాధితులను తక్షణ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పాలు, భోజనం, బియ్యం, నిత్యవసర వస్తువులు, త్రాగునీరు, వైద్య సదుపాయాలు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వెంటనే బాధితులకు అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, గత 20 సంవత్సరాలుగా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత మాత్రమే అందించే వారిని వరదల కారణంగా నీటమునిగిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీ మరియు ఇన్సూరెన్స్ అందరికీ అందే విధంగా చూడాలని వివిధ శాఖల అధికారులకు తెలియజేసారు. అనంతరం వరద బాధితులను బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఆర్ సి పి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here