SGS TV Telugu

24×7 News

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌

30, ఏప్రియల్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము భృగు వాసరే
( శుక్ర వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు

🐐 మేషం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదుర్కోకుండా చూసుకోవాలి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. అష్టమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. చంద్ర ధ్యానం శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
శ్రమ పెరుగుతుంది. ఉద్యోగం విషయంలో అశ్రద్ధ రానీయకండి. తోటివారి మధ్య భేదాభిప్రాయం రానీయకండి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఇబ్బందులు తొలుగుతాయి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
శుభకాలం. ప్రారంభించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధు మిత్రుల సహకారం ఉంటుంది. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. కాలానుగుణంగా ముందుకు సాగండి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చంద్రశేఖరాష్టకం పఠించాలి.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ప్రారంభించిన పనులను కుటుంబసభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. ఈశ్వర ధ్యాన శ్లోకం చదువుకోవాలి.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
మిశ్రమకాలం. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.
💃💃💃💃💃💃💃

తుల
ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. దైవబలం సదా రక్షిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
మనస్సౌఖ్యం కలదు. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. అపరిచితులను అతిగా నమ్మకండి. గురువుల సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. ఆర్థికంగా పొదుపు సూత్రం పాటించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. దైవారాధన మానవద్దు.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
శుభకాలం. చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ మీ రంగాల్లో శుభఫలితాలు అందుకుంటారు. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. రామనామ జపం శుభాన్ని ఇస్తుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
దృఢ సంకల్పంతో చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతతో ముందుకు సాగితే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఇష్ట దైవ నామస్మరణ శ్రేయోదాయకం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. సమాజంలో కీర్తి,యశస్సు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దుర్గారాధన శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవ👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

Total Page Visits: 254 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *