జనాభా పెంపునకు చైనా గ్రీన్‌సిగ్నల్‌..!

1 min read

చైనాలో వేగంగా పడిపోతున్న జనాభా వృద్ధిరేటును కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలోనే ఆ దేశంలోని దంపతులు మూడో బిడ్డను కనేందుకు అనుమతులు ఇవ్వనుందని ప్రముఖ వార్త సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. వేగంగా జనాభా తగ్గిపోతే భవిష్యతులో అది చైనా ఆర్థిక అభివృద్ధిపై పెనుప్రభావం చూపిస్తుందని ఇప్పటికే పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ మేరకు సోమవారం జరిగిన కమ్యూనిస్ట్‌ పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో చర్చించినట్లు షినువా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ‘ప్రతి జంట మూడో సంతానం కనేందుకు అనుమతించారు. దీనికి తగినట్లు విధానాల్లో మార్పులు చేస్తారు’ అని ఆ వార్త సంస్థ పేర్కొంది. కాకపోతే ఈ విధానం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో మాత్రం వెల్లడించలేదు. దీంతోపాటు ఐదేళ్లలో అమలు చేయాల్సిన ప్రధాన నిర్ణయాలపై కూడా చర్చించారు.

చైనా మెల్లగా దేశంలో జననాల రేటును పెంచుకుంటూ వస్తోంది. 1979లో తెచ్చిన ‘ఒక జంటకు ఒకే బిడ్డ’ నిబంధనను కొన్ని దశాబ్దాలు కొనసాగించింది. 2016లో దీనిలో మార్పులు చేసి రెండో సంతానం కనేందుకు అనుమతులు ఇచ్చింది.

Total Page Visits: 32 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed