చనిపోయిన తల్లి చేతిలో సజీవంగా చిన్నారి….

1 min read

గాజా సిటీ: పండగ పూట పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిందా తల్లి. అంతా ఆనందంగా గడుపుతున్న సమయంలో వారు ఉంటున్న భవనంపై బాంబుల వర్షం. ఆ భీకర శబ్దాలకు భయపడుతున్న తన ఐదు నెలల పసికందును గట్టిగా పట్టుకుని అలాగే కుప్పకూలింది. గాజా నగరంలో గతవారం ఇజ్రాయెల్‌ జరిపిన రాకెట్‌ దాడుల్లో ధ్వంసమైన భవన శిథిలాల వద్ద సహాయక సిబ్బందికి కన్పించిన ఓ దృశ్యం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. శిథిలాల కింద చనిపోయిన తల్లి చేతుల్లో బిక్కుబిక్కుమంటున్న ఓ చిన్నారిని సజీవంగా బయటకు తీశారు. ఈ దాడుల్లో కుటుంబంలోని 10 మంది చనిపోగా.. ఈ చిన్నారి మాత్రమే మృత్యుంజయుడిగా బయటపడ్డాడు.

గాజా నగరానికి చెందిన మహమ్మద్‌ అల్‌ హదీదీ, మహా అబు హట్టబ్‌ దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో చిన్నవాడు ఐదు నెలల ఒమర్‌ అల్ హదీదీ. గత శుక్రవారం రంజాన్‌ నాడు మహా అబు తన పిల్లలను తీసుకుని నగరానికి వెలుపల ఉన్న షాటీ శరణార్థుల శిబిరానికి వెళ్లింది. అక్కడే ఆమె సోదరులు, ఇతర బంధువులు ఉంటున్నారు. రాత్రికి అక్కడే ఉంటామని ఫోన్‌ చేసి చెప్పగా మహమ్మద్‌ సరేనన్నాడు. అదే రోజు ఈ శరణార్థుల శిబిరాలపై ఇజ్రాయెల్ దాడిలో చిన్నారి తప్ప అందరూ చనిపోయారు

Total Page Visits: 13 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed