కువైట్‌లోని భారత ఎంబ‌సీ వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబ‌ర్లు ఇవే..

1 min read

కువైట్ సిటీ: కువైట్‌లోని ప్ర‌వాసుల‌కు ఎంబ‌సీ స‌ర్వీసుల‌ను మ‌రింత సులువు చేసేందుకు భార‌త రాయబార కార్యాల‌యం వేర్వేరు స‌ర్వీసుల‌కు వేర్వేరు వాట్సాప్ నెంబ‌ర్లు తీసుకొచ్చింది. వేర్వేరు సేవ‌ల కోసం మొత్తం 12 వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబ‌ర్లను ఎంబ‌సీ ప్ర‌క‌టించింది. వెంట‌నే ఈ నెంబ‌ర్లను భార‌త ప్ర‌వాసుల‌కు అందుబాటులో ఉంచుతున్న‌ట్లు పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌వాసులు ల్యాండ్‌లైన్ నెంబ‌ర్‌, మొబైల్ నెంబ‌ర్, ఈ-మెయిల్, నేరుగా కార్యాల‌యం సంద‌ర్శ‌న ద్వారా ఎంబ‌సీ స‌ర్వీసులు పొందుతుండ‌గా, దీనికి అద‌నంగా ఈ వాట్సాప్ నెంబ‌ర్లు తీసుకొచ్చిన‌ట్లు రాయ‌బార కార్యాల‌యం వెల్ల‌డించింది. ఈ నెంబ‌ర్ల ద్వారా ప్ర‌వాసులు త‌మ‌కు కావాల్సిన స‌ర్వీసు కోసం పూర్తి వివ‌రాల‌తో(పేరు, అడ్ర‌స్‌, కాంటాక్ట్ నెంబ‌ర్‌) ఎంబ‌సీకి టెక్స్ట్ సందేశాలు పంపించ‌వ‌చ్చు. అయితే, ఈ నెంబ‌ర్ల‌పై వాట్సాప్ కాల్ చేయ‌డానికి లేదు. కేవ‌లం సందేశాలు మాత్ర‌మే పంపొచ్చు. అలాగే ఎంబ‌సీ అధికారిక ప‌ని వేళ‌ల్లో మాత్ర‌మే ఈ నెంబ‌ర్లు ప‌ని చేస్తాయి.

 1. పాస్‌పోర్టు(సాధార‌ణ సందేహాలు కాకుండా): కాన్సుల‌ర్ వింగ్ వాట్సాప్ నెం.+965-65501767
 2. వీసా, ఓసీఐ, అటెస్టేషన్, ఇతర సేవలు: కాన్సుల‌ర్ వింగ్ వాట్సాప్ నెం.+965-65501013
 3. హాస్పిటల్, అత్యవసర వైద్య సహాయం: క‌మ్యూనిటీ వెల్ఫేర్ వాట్సాప్ నెం.+965-65501587
 4. డెత్ రిజిస్ట్రేషన్: కమ్యూనిటీ వ్యవహారాలు వాట్సాప్ నెం.+965-65505246
 5. కువైట్‌లోని భారతీయ సంఘాలు: కమ్యూనిటీ వ్యవహారాలు వాట్సాప్ నెం.+965-65501078
 6. ఆడ గృహ కార్మికులు(వీసా 20): లేబర్ వింగ్ వాట్సాప్ నెం.+965-65501754
 7. కార్మిక (వీసా 14,18) & మగ గృహ కార్మికులు (వీసా 20): లేబర్ వింగ్ వాట్సాప్ నెం.+965-65501769
 8. కమర్షియల్ అటెస్టేషన్: కామర్స్ వింగ్ వాట్సాప్ నెం.+965-65505097
 9. ఎమ‌ర్జెన్సీ హెల్ప్‌లైన్ (అధికారిక పని వేళ‌లు ముగిసిన త‌ర్వాత‌): అడ్మినిస్ట్రేషన్ వింగ్ వాట్సాప్ నెం.+965-65501946
 10. పాస్‌పోర్టు (సాధారణ సందేహాలు): అవుట్‌సోర్స్ సెంటర్ వాట్సాప్ నెం.+965-65506360
 11. గృహ కార్మికులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు (వీసా 20): అవుట్‌సోర్స్ ఏజెన్సీ వాట్సాప్ నెం.+965-51759394
 12. గృహ కార్మికుల స‌మ‌స్య‌ల‌పై నేరుగా ఫోన్ చేసేందుకు, వాట్సాప్ సందేశాల కోసం: అవుట్‌సోర్స్ ఏజెన్సీ వాట్సాప్ నెం.+965-55157738
Total Page Visits: 9 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed